ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

Fatal road accident.. Five killed

హైదరాబాద్‌ః రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్న వేళ మరో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులందరూ హైదరాబాద్ వాసులేనని గుర్తించారు. కారులో ప్రయాణించిన అందరూ చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో నూతన దంపతులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

మృతులంతా సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. కుటుంబ పెద్ద రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. కాగా ఫిబ్రవరి 29న బాల కిరణ్‌, కావ్యలకు వివాహం జరిగింది.