వైసీపీ ఎమ్మెల్యే గ్లామర్ షో ఫై విమర్శలు

వైసీపీ ఎమ్మెల్యే గ్లామర్ షో ఫై విమర్శలు

సినీ నటి రోజా గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రేమ తపస్సు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈమె..ఆ తర్వాత వరుసపెట్టి అగ్ర హీరోల సరసనే కాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రాజకీయాలతో పాటు బుల్లితెర ఫై జడ్జి గా రాణిస్తూ..అలరిస్తుంది.

వాస్తవానికి ఇద్దరు బిడ్డల తల్లి .. ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయి ఉండి కూడా ఇప్పటికీ.. గ్లామర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అంటారు రోజా అభిమానులు. అన్ని రకాల వస్త్రాలను ధరించడం.. రోజా స్టయిల్. అది ఇది అనే తేడా లేకుండా.. ప్రేక్షకులను మెప్పించా లనే ఆమె తపనను అర్ధం చేసుకోవాల్సిందే. ఓ చానెల్లో వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో హాట్ కామెంట్లు చేయడంతోపాటు.. గ్లామర్ షోయింగ్ చేస్తున్న రోజాకు అభిమానులు బాగానే ఉన్నారు.

తాజాగా ఈమె చేసిన ఓ గ్లామర్ ఫోటో షో ఆమెను విమర్శలపాలుచేసింది. ఎల్లో కలర్ టాప్ లో రోజా ఆకట్టుకొంటుంది. ఈ ఫోటోలపై కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.. ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి .. ఇంకా ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఆమె ఇలా ఇంత గ్లామర్ షో.. చేయాల్సిన అవసరం ఉందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. నగరి నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రాజకీయంగా కూడా ఆమె తీవ్ర ఇరకాటంలో ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్ కొత్తకాదు.. ఇంకా రాణించాలనే ఆశ తీరదు.. అయినప్పటికీ.. ఆమె నియోజకవర్గానికి కూడా టైం ఇవ్వాలి కదా అంటున్నారు.