ఉక్రెయిన్‌లో క్షిపణి దాడి.. 16 మంది మృతి

Russian missile strikes kill 16 in Ukraine shopping mall

కీవ్‌ : ఉక్రెయిన్‌లోని సెంట్రల్‌ సిటీ క్రెమెన్‌చుక్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌పై రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో 16 మంది మృత్యువాతపడ్డారు. మరో 59 మంది గాయపడ్డట్లు ఉక్రెయిన్‌ అత్యవసర సేవల అధిపతి సెర్గి క్రుక్‌ మంగళవారం వేకువ జామున ప్రకటించారు. షాపింగ్‌ మాల్‌పై మిస్సైల్‌ దాడి అనంతరం రెస్క్యూ పనులు, శిథిలాల తొలగింపు, మంటలను ఆర్పివేసే ప్రధాన పనులు కొనసాగుతున్నాయన్నారు. మిస్సైల్‌ దాడి సమయంలో మాల్‌లో వెయ్యి మందికిపైగా పౌరులు ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పేర్కొన్నారు.

మంటలతో ఫైటర్లు పోరాడుతున్నారని, బాధితుల సంఖ్యను ఊహించలేమని జెలెన్‌స్కీ ఫేస్‌బుక్‌లో పేర్కొన్న ఆయన.. ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అయితే, రష్యా క్షిపణి దాడిని నగర మేయర్‌ విటాలి మాలెట్‌స్కీ ఖండించారు. పౌర జనాభాపై విరక్తికరమైన తీవ్రవాద అచర్య అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మరిన్ని భారీ ఆయుధాలను సరఫరా చేయాలని, రష్యాపై ఆంక్షలు విధించాలని మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. రష్యా మానవాళికి అవమానకరం, అది పర్యావసరాలను ఎదుర్కొవాలన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/