జై జవాన్‌-జై కిసాన్‌ స్ఫూర్తి ప్రదాత లాల్‌బహదూర్‌

నేడు లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి

lal bahadur shastri
lal bahadur shastri

సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతిగల ప్రధానిగా, భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్‌బహదూర్‌ శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరా§్‌ులో అక్టోబర్‌ 2, 1904న జన్మించారు. లాల్‌బహదూర్‌ శాస్త్రికి చిన్ననాట ఆర్థిక పరిస్థితి సజావ్ఞగా లేక నదిని ఈది పాఠశాలకు వెళ్లేవారు.ఉన్నత విద్య వారణాసిలో ముగియగానే 17 సంవత్సరాల గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపుకు ఆకర్షితులైనారు. ఉద్య మంలో పాల్గొని తొలిసారి అరెస్టు అయ్యారు. విడుదల అనం తరం కాశీ విద్యాపీఠంలో నాలుగు సంII ఫిలాసఫీ కోర్సు చేసి అనంతరం 1926లో డిగ్రీ పొందారు. అలా శాస్త్రి డిగ్రీ ఆయ న పేరులో ఇమిడిపోయింది. 1921లో వీరు ‘ది సర్వెంట్స్‌ ఆఫ్‌ ది ప్యుపిల్‌ సొసైటీలో చేరి యువకులను సమీకరించి, దేశభక్తి ప్రబోధం చేపట్టారు.1930లో ప్రజాచట్ట ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని ప్రజలు పన్నులు కట్టకుండా ప్రచారం నిర్వహించినందు కు ఆయనను బ్రిటిష్‌వారు రెండున్నర ఏళ్లు జైలులో పెట్టారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం అనంత రం కాంగ్రెస్‌పార్టీ సత్యాగ్రహలు ప్రారంభించింది.తర్వాత ఆయ న క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.మరల ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో మొత్తం 9 సంII పాటు జైలులోనే గడిపా రు.1945లో జైలు నుండి విడుద లైన వీరు యుపి కేబినెట్‌లో పోలీ సు, ట్రాన్స్‌ఫోర్ట్‌ మంత్రిగా చేశారు. ఆ తర్వాత 1951లో లోక్‌సభ ప్రధాన కార్యదర్శిగా నియమితులై నారు.1952లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాస్త్రి నెహ్రూ మంత్రివర్గంలో రైల్వేమంత్రిగా పనిచేసి పలు సంస్కరణలు చేపట్టారు. మొదటి తరగతి, మూడవ తరగతుల మధ్య ఎక్కువ తేడాలు లేకుండా వసతి రూపకల్పనలు కల్పించారు. తాను రైల్వే మంత్రిగా పనిచేస్తుండగా 1956లో జరిగిన ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రిగా రాజీనామా చేశారు. సహచరుల తోపాటు సాక్షాత్తు ప్రధాని వారించినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొంది రవాణా ప్రసారశాఖల మంత్రిగా తర్వాత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1961లో హోంశాఖ మంత్రిగా భారత్‌, చైనాల మధ్య జరిగిన యుద్ధ సమయంలో అంతర్గత భద్రతల విషయంలో ఎంతో శ్రద్ధ చాకచక్యం ప్రదర్శించారు. 1964లో నెహ్రూమరణాంతరం శాస్త్రి ఏకగ్రీవంగా భారతప్రధానిగాఎన్ను కోబడ్డారు.1965లోఒకవైపు ఆహారనిల్వ కొరత,మరోవైపు పాకి స్థాన్‌ యుద్ధసమస్య ఆ సమయంలోనే జై జవాన్‌ -జై కిసాన్‌ నినాదాన్ని శంఖంలా పూరించి పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్‌ను గెలిపించారు.ఆనాటికి దేశంఆహార సంక్షోభంలోఉంటే గ్రీన్‌రివల్యూషన్స్‌కి బాటలువేశారు.రష్యామధ్య వర్తిత్వంతో తాష్కండ్‌లో 1966 జనవరి 10న ఏర్పాటు చేసిన ఒక సమా వేశంలో భారత్‌, పాకిస్థాన్‌ ఒక అంగీకారంపై సంతకం చేసి మరుసటిరోజు ఆయన గుండెపోటుతో మృతిచెందారు.
డా.జె.వి. ప్రమోద్‌కుమార్‌

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/