బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించినందుకు వెక్కి వెక్కి ఏడ్చిన అభిమాని

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుండి బండి సంజయ్ ని తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అప్పగించారు. అయితే బండి సంజయ్ ని తప్పించడం తో ఆయన సహచరులు , అభిమానులు తెగ బాధపడుతున్నారు. అయితే అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత మొదటిసారి కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్ పర్యటించారు.

శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో కలిసి మహాశక్తి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక అభిమాని సంజయ్‌ను పట్టుకుని ఏడ్చాడు. బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. బండి సంజయ్‌ను పట్టుకుని అభిలాష్ అనే అభిమాని బోరున ఏడ్చాడు. దీంతో అతడికి బండి సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. బండి సంజయ్‌ను పట్టుకుని ఏడుస్తుండటంతో.. మిగతా కార్యకర్తలు అతడిని పక్కకు తీసుకెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు.