పిల్లలకు నేర్పించాల్సిన అంశాలు

పిల్లలకు చదువు చెప్పడం అంటే పాఠాలు మాత్రమే కాదు. చదువు రూపంలో ఎన్నో నేర్పించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యావిధానాన్ని అనుసరిస్తున్న దేశాల్లో జపాన్ ఒకటి. అక్షరాస్యతతో పాటు, సాంకేతికత, గణితాన్ని విద్యార్థులకు నేర్పించడంలో జపాన్ మొదటిస్థానంలో ఉంది. ఆరేళ్ల వరకు ప్రాథమిక విద్య ఆ తరువాత మూడేళ్లు జూనియర్ హైస్కూల్ ఉంటుంది. పరీక్షలు ఉండవు. ఆ తరువాత మూడేళ్లపాటు హైస్కూల్ చదవాలి.
ఈ లోపు ఉన్నతావిద్యాభ్యాసాన్ని వారి ఆసక్తి మేరకు ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారులకు చదువుతోపాటు సత్ప్రవర్తన, ఆ దేశ సంప్రదాయాలు, కళల పట్ల శిక్షణ ఉంటుంది. ఇతరులను గౌరవించడం, తోటివారితో కలిసి పనిచేయడం, సమానభావం వంటి అంశాలను నేర్పిస్తారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవంతోపాటు, అనుబంధాన్ని పెంచుతారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు, ఎవరి తరగతి గదులను వారే వంతులవారీగా శుభ్రపరచుకోవడంలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. పోషకాహారానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
విద్యార్థులకు చిన్నవయసు నుండే గణితం అలవాటు చేస్తారు. సింగపూర్‌లో. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ విద్యార్థులు చిన్న వయసు నుంచే అవార్డులను సొంతం చేసుకుంటారు. ప్రాథమిక స్థాయి నుంచే చిన్నారులు పోటీ తత్వంలోనే పెరుగుతారు. అలాగే ఇక్కడి విద్యార్థులు గణితం, సైన్సులో పొందే శిక్షణా విధానాన్ని మిగతా దేశాలు సింగపూర్ మోడల్ పేరుతో అనుసరించడం విశేషం. ప్రపంచ విద్యా వ్యవస్థలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశాల్లో ఫిన్‌ల్యాండ్ ఒకటి.
ప్రాథమిక స్థాయి తరువాతే ఇక్కడి పాఠశాలల్లో విద్యార్థులకు హోంవర్క్ ఉంటుంది. పరీక్షలు ఉండవు. పిల్లలకు 16 సంవత్సరాల వయసులో ఒక పరీక్ష రాయాల్సింటుంది. సంప్రదాయ కళలకు ఇక్కడ పెద్ద పీట వేస్తారు. సామాజిక నైపుణ్యాలను అలవరుస్తారు. ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో నేర్పిస్తారు. పిల్లలకు అర్ధమయ్యేలా ప్రయోగాత్మకమైన బోధన ఉంటుంది. దీంతో విద్యార్థులకు ఆ పాఠాలు గుర్తుండిపోతాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/