స్త్రీ ..ఓ అద్భుత సృష్టి

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం

women empowerment
women empowerment

అనురాగాల పందిరి ఆమె
అనుబంధాల సందడి ఆమె ఇంకాని చెలమ ఆమె
శాశ్వత చెలిమి ఆమె దైవంత అమ్మ ఆమె
దివ్యత్వం సంతరించుకునే ఆమె
కన్నీటి కాసారం ఆమె
కడలిలా గంభీర ఆమె
చైతన్య జలపాతమూ ఆమె
నిర్భయంగా పరిణీత ఆమె
అసురుల పాలిట అపరకాళీ ఆమె
సాధనలో ఋషి తుల్య ఆమె
అందమైన కావ్యం ఆమె
పవిత్ర ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆమె
సృష్టికే కల్ప వృక్షం ఆమె
ఎనలేనని త్యాగం ఆమె
గృహాన్ని స్వర్గసీమగా మార్చేది ఆమె
ఓ అద్భుత సృష్టి ఆమె..
-డాక్టర్ చిట్యాల రవీందర్

స్వస్థ (ఆరోగ్య విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/