సంక్రాంతి బరినుండి తప్పుకున్న ఎఫ్ 3

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. దానిని మించేలా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. కాగా మొదటి నుండి ఈ సీక్వెల్ ను 2022 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు అధికారికంగా తెలుపుతూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా ను పిబ్రవరి 25 వ తేదీన.. శివరాత్రి కానుకగా కానుకంగా విడుదల చేయనుంది చిత్ర బృందం.

ఈ మేరకు పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. సంక్రాంతి నుండి తప్పుకోవడానికి కారణం సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు రిలీజ్ కు ఉండడమే అని తెలుస్తుంది. సంక్రాంతి కి ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ , భీమ్లా నాయక్ , సర్కారు వారి పాట చిత్రాలతో పాటు బంగార్రాజు కూడా బరిలో ఉంది. ఇన్ని సినిమాల మధ్య రిలీజ్ చేస్తే కలెక్షన్ల తో పాటు థియేటర్స్ సమస్య ఉంటుందని ఎఫ్ 3 యూనిట్ భావించినట్లు అర్ధమవుతుంది. ఈ చిత్రంలో ఎఫ్2 లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.