సీక్వెల్‌ను రెడీ చేస్తోన్న జోంబి రెడ్డి

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘జోంబి రెడ్డి’ లాక్డౌన్ తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. టాలీవుడ్లో తొలి జోంబీ మూవీ కావడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని కనబరిచారు.
ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సె్స్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాకు ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా సీక్వెల్‌ను వెంటనే ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్టు పనులను మొదలుపెడుతున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు.
ఏదేమైనా టాలీవుడ్లో తొలి జోంబీ చిత్రంగా వచ్చిన ఈ మూవీ సీక్వెల్ కూడా త్వరలోనే రానుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సీక్వెల్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.