క్షణాల్లో కనుబొమ్మల అందాన్ని మార్చే ఐబ్రో స్టాంప్ కిట్

అందమే ఆనందం

ఆకర్షించే కళ్లూ .. కనుబొమ్మలూ అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. అందుకే చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.. చక్కని కనుబొమ్మల ఆకారం కోసం ఐబ్రో పెన్సిల్ వాటుతుంటారు… కానీ దానివలన అనుకున్నంత అందం రాకపోవచ్చు… మరైతే ఇంకేం చేయచ్చు. అని అనుకునేవారికోసమే ఇపుడు ఐబ్రో స్టాంప్ పెన్సిల్ కిట్ మార్కెట్ లోకి వచ్చింది..

దీంట్లో కనుబొమ్మలని నల్లగా కనిపించేలా చేసే ఐబ్రో స్టాంప్ తో పాటూ రకరకాల ఆకారాల్లో ఉండే కనుబొమ్మల అచ్చులు ఉంటాయి.. వాటిని మన కనుబొమ్మల పైన అతికించి ఐబ్రో స్టాంప్ దిద్దుకున్నామంటే సరిగ్గా ఆ తీరులోనే కనుబొమ్మలు చక్కగా కనిపించేస్తాయి.. కావాలంటే ఒక్కోసారి ఒక్కోలా చాలా సులువుగా నిమిషాల్లో మన కనుబొమ్మల రూపాన్నీ మార్చేసుకోవచ్చు.. అందుకే మీ మేకప్ కిట్ లో దీన్నీ చేర్చేసుకోండి.. మరెందుకిక ఆలస్యం..

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/category/telangana/