ఐపిఎల్‌ జరుగుతుందని ఆశిస్తున్నా… మనోజ్‌ బదలే

ఈ సారి మిని ఐపిఎల్‌ నిర్వహించవచ్చు

manoj badale
manoj badale

ముంబయి: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఐపిఎల్‌ నిర్వహణపై సందేహలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఐపిఎల్‌ నిర్వహణ వాయిదా పడగా.. ఇపుడు ఐపిఎల్‌ జరుగుతుందా అనే దానిపై నీలినీడలు కమ్ముతున్నాయి. అయితే ఈ ఏడాది ఐపిఎల్‌ నిర్వహించడం సాధ్యం అవుతుందని, కాని పూర్తి స్థాయిల కాకుండా మిని ఐపిఎల్‌ లాగా నిర్వహించవచ్చని రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని మనోజ్‌ బదలే అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది ప్రత్యేక ఐపిఎల్‌ ఉంటుందని ఆశిస్తున్నా..మిని ఐపిఎల్‌ కూడా నిర్వహించవచ్చు. బోర్డు సభ్యులంతా కలిసి టోర్నిని నిర్వహించడానికి ప్రయత్నించాలి. క్రికెట్‌కు ఈ టోర్ని ఎంతో ముఖ్యం. ఇది ఎంతో మందికి జీవనోపాది. టోర్నీ నిర్వహణ కోసం సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం అని మనోజ్‌ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/