భారత్ : 1,721 పాజిటీవ్, 52 మృతులు
24 గంటల్లో 227 కొత్త కేసులు

New Delhi: భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 227 కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో ఇప్పటివరకు 1,721 మందికి కరోనా సోకగా, 52 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 150 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మరణాలు నమోదయ్యాయి. కేరళలో 241 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి చెందారు.
తమిళనాడులో 124 పాజిటివ్ కేసులు,ఒకరు మృతి చెందారు.
ఢిల్లీలో 121 కేసులు,ఇద్దరు మృతి చెందారు. కర్ణాటకలో 101 పాజిటివ్ కేసులు,ముగ్గురు మరణించారు. ఉ
త్తరప్రదేశ్ లో 104 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ 93 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో 97 కేసులు నమోదుకాగా, 6మంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ లో 87 కేసులు నమోదు అయ్యాయి.
మధ్యప్రదేశ్ 86 కేసులు,నలుగురు మృతి చెందారు. గుజరాత్ లో 82 కేసులు,6 మరణాలు నమోదయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో 55 కేసులు,ఇద్దరు మృతి చెందారు.
హర్యానాలో 43 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ లో 41 కేసులు,నలుగురు మృతి చెందారు.
పశ్చిమ బెంగాల్ 27కేసులు,నలుగురు మృతి చెందారు.
బీహార్ 21 కేసులు,ఒకరు మృతి చెందారు.
చండిఘడ్ 15,లడక్ 13,అండమాన్ 10,చత్తీస్గఢ్ 9,ఉత్తరాఖండ్ 7,గోవా 5,హిమచల్ 3,ఒడిశా 3,అస్సాం 1,ఝార్ఖండ్ 1,మిజోరాం1,మణిపూర్1,పుదుచ్చేరి 3 కేసులు నమోదు అయ్యాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/