నాన్ సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ధర తగ్గింపు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన

LP Gas Cylinder
LP Gas Cylinder

New Delhi: సబ్సిడీ లేని ఎల్ పీజీ సిలెండర్ ధర రూ. 65లు తగ్గింది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది.

కరోనా విజృంభణ కారణంగా దేశ వ్యాప్త లాక్ డౌన్ లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎల్ పీజీ సిలెండర్ ధర తగ్గడం ఒకింత ఊరట కల్గిస్తోంది

కాగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా గ్యాస్ సిలెండర్ ధర తగ్గించినట్లు పేర్కొన్న ఐఓసీ ఈ తగ్గుదల నేటి నుంచి అమలులోనికి వస్తుందని పేర్కొంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com