ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాను మృతి

Exchange fire in Chhattisgarh.. jawan died

న్యూఢిల్లీః ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో ఓ జవాను మృతి చెందగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ – ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్పెషల్‌ ఫోర్స్‌ అధికారులు యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అడవిలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ మృతి చెందగా.. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాను పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది.