యూపీలో ఢిల్లీ తరహా ఘ‌ట‌న‌.. మాజీ ప్రియురాలిని 6 ముక్క‌లుగా నరికిన ప్రియుడు

శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్ లో చుట్టి బావిలో పడేసిన వైనం

Ex-lover Chops Woman’s Body Into 6 Pieces In Azamgarh

లక్నోః దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య ఘ‌ట‌న మ‌రువక ముందే.. అలాంటి ఘ‌ట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. తనను ప్రేమించి, దగ్గరైన యువతి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో దారుణానికి తెగబడ్డాడో యువకుడు. నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి బావిలో పడేశాడు. తలను మాత్రం విడిగా ఓ చెరువులో విసిరేశాడు. అయితే మృతదేహం బయటపడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు, అతడి దగ్గర నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణానికి తన కుటుంబ సభ్యులు కూడా సహకరించారని నిందితుడు బయటపెట్టాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆజంగఢ్ జిల్లాలో పశ్చిమి గ్రామంలోని వ్యవసాయ బావిలో మృతదేహం బయటపడడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ముక్కలుగా నరికిన ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఓ మహిళ మృతదేహంగా గుర్తించిన పోలీసులు తల మాత్రం దొరకలేదని వెల్లడించారు. విచారణలో అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ ఈ హత్య చేశాడని బయటపడడంతో నిందితుడిని అరెస్టు చేశారు. డెడ్ బాడీ తలను ఓ చెరువులో పడేశానని చెప్పడంతో యాదవ్ ను గ్రామానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించిన యాదవ్ పై కాల్పులు జరపగా.. యాదవ్ కాలుగు బుల్లెట్ గాయమైందని పోలీసులు చెప్పారు.

తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు యాదవ్ చెప్పాడు. తన తమ్ముడితో కలిసి చెరుకు తోటలో మాజీ ప్రియురాలిని చంపి, శవాన్ని ఆరు ముక్కలు చేసినట్లు తెలిపాడు. అక్కడికి దగ్గర్లోని బావిలో పడేసిన మృతదేహం భాగాలు బయటపడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/