సినీ ప్రేమికులకు జగన్ గుడ్ న్యూస్

సినీ ప్రేమికులకు జగన్ గుడ్ న్యూస్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్ అందించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే టికెట్ల ధరను భారీగా తగ్గించిన జగన్..ఇప్పుడు ఆన్లైన్ టికెట్స్ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు సినిమా చూడాలంటే లైన్లో నిల్చుని టికెట్స్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు ఆన్లైన్ లోనే టికెట్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా టికెట్ల విషయంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపి సినిమా అభిమానులకు సంతోషం నింపింది.

‘‘సినిమా థియేటర్స్‌లో టికెట్లు విక్రయించే ప్రక్రియను నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది.’’ అని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది.