బైరి నరేష్‌ బాబాయ్ కొడుకు వివాదాస్పద పోస్టు..అతడి కోసం పోలిసుల గాలింపు

బైరి నరేష్‌ బాబాయ్ కొడుకు ఓ వివాదాస్పద పోస్టు పెట్టడం తో అతడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణం నరేష్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ..నరేష్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ..అతడి తమ్ముడు (బాబాయ్ కొడుకు) బైరి అగ్నితేజ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టాడు.

‘బైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని ధర్నా చేయడం అంటే.. అయ్యప్ప న్యాయం చేయలేడని నమ్ముతున్నారా? నరేష్ మీద కేసులు పెడితే, అయ్యప్ప పుట్టుక ఎలా జరిగింది బహిరంగంగా కోర్టులు చెప్పాలని భారత నాస్తిక సమాజం డిమాండ్ చేస్తుంది. అయ్యప్పకి మొక్కి వదిలేయకుండా బాబా సాహెబ్ ఇచ్చిన హక్కుతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి న్యాయం చేయాలి’ అని అగ్నితేజ పోస్టు పెట్టాడు. ఇతడు చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. దీంతో పోలీసులు తేజ కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే తేజ స్వగ్రామంకు వెళ్లి ఆరాతీసారు.

నరేష్ విషయానికి వస్తే వరంగల్ లోని ఓ హోటల్ ఉన్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి..వికారాబాద్ ఎస్పీ కార్యాలయంకు తరలించారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నరేష్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నరేష్ పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా పరారీలో ఉన్న నరేశ్ ను.. సోషల్ మీడియాలో ట్రేస్ చేసి వరంగల్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.