ఎర్రబెల్లిదయాకర్‌కు కెటిఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

ఎర్రబెల్లిదయాకర్‌కు కెటిఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు
KTR wishes Errabelli Dayakar Rao on his birthday

హైదరాబాద్‌: ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌, రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు జన్మదినం సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. మరిన్నిపుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో అత్యంత నిరాడంబరంగా మంత్రి ఎర్రబెల్లి తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. కాగా ఇప్పటికే తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ తనను కలువడానికి రావద్దని, పార్టీకార్యకర్తలుకానీ, అభిమానులు కానీ తనపై ఉన్న అభిమానాన్నిచూపించుకోవడానికి కనీసం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. మంత్రి పిలుపు మేరకు ఆయన నియోజక వర్గంలోని పాలకుర్తిలో లక్షమొక్కలు నాటేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/