రైతు కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి

బిఆర్ఎస్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతు కూలీగా మారాడు. స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి. గ్రామంలో ఆయన సొంత పొలంలో సొంత సందడి చేశారు. కూలీలతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నారు పీకి , నాటు వేసి ఆశ్చర్యపరిచారు. సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి వెళ్లాడు… గొర్రు పట్టి దున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

కూలీల‌తో క‌లిసి, వారి పాట‌ల‌కు గొంతు కలిపి నాట్లు వేశారు. కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. గతంలో నెర్రెలు పారిన పొలాలు.. స్వరాష్ట్రంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి. అన్నదాత కళ్లలో ఆనందం క‌నిపిస్తుంది.