ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు తొలగించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ హైకోర్టు ఆదేశం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కు సంబదించిన భద్రతను తెలంగాణ ప్రభుత్వం తొలగిచింది. దీంతో ప్రదీప్‌రావు ప్రభుత్వ తీరు ను తప్పుపడుతూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భద్రత తొలగించారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ లో పేర్కొన్నాడు. గతంలో కోర్టు ఆదేశాలతో ప్రదీప్ రావుకు భద్రత కల్పించారు. ప్రస్తుతం పోలీసులు తనకు భద్రత ఎందుకు తొలగించారో తెలియదని పిటిషన్ లో వివరించాడు.

తాను బీజేపీలో చేరినందుకే గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించిందని ప్రదీప్‌రావు ఆరోపణలు చేశారు. ఓ ఎమ్మెల్యే నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో గన్‌మెన్‌ల తొలగింపు కక్షసాధింపు చర్యే అంటూ ప్రదీప్‌రావు మండిపడ్డారు. వెంటనే తనకు భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్ ఫై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు తొలగించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న 2 + 2 గన్మెన్లను కేటాయించాలని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భద్రతను కొనసాగించాలని తెలిపింది.