శాకుంతలం నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

శాకుంతలం నుండి రుషివనంలోన అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకోగా..ఇప్పుడు రెండో సాంగ్ విడుదల అయ్యింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 17 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే..సినిమా ప్రమోషన్ ను వేగం చేస్తున్నారు.

తాజాగా ‘రుషివనంలోన’ అనే పాటని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.శ్రీమణి రాసిన ఈ రొమాంటిక్ సాంగ్‌కి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వినసొంపైన సంగీతం అందించారు. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిన శాకుంతలం మూవీకి ఈ పాట చాలా కీలకమని తెలుస్తోంది. తెలుగులో ఈ పాటని చిన్మయి, సిద్ శ్రీరామ్ పాడారు. ఈ మూవీలో మంచు మోహన్‌ బాబుతో పాటు ప్రకాశ్ రాజ్, అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌ తదితరులు నటించారు. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా గెస్ట్ రోల్ చేసింది. మరి మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.