శ్రీవారి దర్శనాలు నిలిపేయండి.. రమణ దీక్షితులు

స్వామివారి ఆరాధన ఒక్కరోజు కూడా ఆపరాదన్న రమణదీక్షితులు

తిరుమల: తిరుమలల్లో అర్చకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, కరోనా బారినపడిన అర్చకుల స్థానంలో టీటీడీ అనుబంధ ఆలయాల నుంచి అర్చకులను శ్రీవారి సేవల కోసం తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు, ఆగమ సలహా మండలి సభ్యుడు రమణ దీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకుల స్థానంలో వేరొకరికి తీసుకు రాలేమని వ్యాఖ్యానించిన రమణ దీక్షితులు..శ్రీవేంకటేశ్వరునికి నిత్య ఆరాధనలు ఆపితే మానవ జాతికి మంచిది కాదని అన్నారు. కొన్ని వారాలపాటు స్వామి వారి దర్శనం ఆపాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. దర్శనాలు నిలిపి పూజలు ఏకాంతంగా నిర్వహించడం ద్వారా అర్చకులకు రక్షించిన వారు అవుతామని రమణ దీక్షితులు అన్నారు. సిఎం జగన్‌ ,టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్వీటర్ ద్వారా తన సూచనలను అందించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/