ఆమె ఇష్టానికి విలువ ఇవ్వండి

మనస్విని-మానసిక సమస్యలకు పరిష్కారం

Give value to her will

మేడమ్‌! నాపేరు పుష్పప్రియ. నా వయస్సు 47 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు పాప, బాబు, పాప ఎవరినో ప్రేమించింది.

మాకులం కాదు. అందువల్ల మాకిష్టం లేదు. ఎంతో ప్రేమతో మా పాపను పెంచుకొన్నాం. ఇప్పుడేమో ఆమె మాకిష్టం లేని అబ్బాయిని పెళ్లిచేసుకొంటానంటోంది. ఏం చేయమంటారు.

ఈ విషయమై మాకు చాలా బాధగా ఉంది. తేరుకోలేకపోతున్నాము. ఏంచేస్తే మా బాధ తగ్గుతుంది. కొంచెం వివరించండి. ప్లీజ్‌… – ప్రియ, హైదరబాద్‌

మీరు తప్పక మామూలుగా అయిపోతారు. దిగులు పడవద్దు. అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. సానుకూలంగా ఆలోచించండి. పెళ్లి విషయంలో మీ అమ్మాయి వ్యక్తిగత అభిరుచికి గౌరవం ఇవ్వండి.

ఈ విషయంలో మీరు ఆమెని అర్థం చేసుకోవాలి. ఆమెతో స్నేహంగా ఉండండి. ప్రేమతో ఆమెకి మార్గ దర్శకత్వం ఇవ్వండి. ఆమెకి మంచి చెడులను తెలియచెప్పండి. కానీ ఆమెని దూషించవద్దు. ఆమె వివాహం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చేయవద్దు.

ఆమె జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు ఆమెను తీసుకోనివ్వండి. మీరు ఆమెకు తోడునీడగా ఉండండి. ఆమెని ఆదరించండి. మానవ్ఞలంతా ఒకే కులం. తేడాలుండకూడదు. ఏ విషయాన్నైనా శ్రద్ధగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి.

మీ పిల్లలను మీరు తప్పక ఆత్మీయంగా ఆదరించాలి. వరుని ఎంపికలో ఆమెను భాగస్వామిని చెయ్యండి. వివాహం పెద్ద బాధ్యతతో కూడింది. ఆమె ఇష్టానికి విలువనియ్యండి. బాధ్యతగా ఆలోచించటం నేర్పండి.

స్పష్టత ముఖ్యం. సరియైన సమయంలో సరియైన నిర్ణమయాలు తీసుకోండి. మీరుకుంగిపోవద్దు. ఆనందంగా మీ అమ్మాయి వివాహం చేయ్యండి. జీవితం విలువైంది.

ప్రతిక్షణం విలువైంది. జీవితం విలువలు మీరు మీ పిల్లలకు నేర్పాలి. అంతేకానీ మీరు వారికి శత్రువులుగా ఉండకూ డదు. మిత్రులుగా ప్రేమించాలి. దగ్గరకు తీసుకోవాలి.

గృహవాతావరణాన్ని ఆనందంగా మలచుకోవాలి

మేడమ్‌! నా వయస్సు 35 సంవత్సరాలు. నాకు ఒక పాప. పెళ్లై 10 సంవత్సరాలైంది. మాది జాయింట్‌ ఫ్యామిలీ. అందరం కలిసే ఉంటాం.

కానీ మామాయ్యగారు. అత్తయ్యగారు చాలా విసిగిస్తున్నారు నన్ను. ఏంచెయ్యాలో తెలియటం లేదు. ఎదిరించలేను. కానీ సర్దుకోలేకపోతున్నాను.

నా భర్త మెతక. వాళ్ల అమ్మనాన్నను ఏమీ అనరు. నేను కూడా ఎదురుచెప్పను.కానీ ఈ బాధలు భరించలేకపోతున్నాను. ఏం చెయ్యాలో వివరించండి. ప్లీజ్‌ .. – సుష్మ.

మీరు తప్పక ఈ బాధలను విముక్తి పొందగలరు. మీరు మీ అత్త మామ లను చక్కగా ఆదరించండి. ప్రేమతో చూడండి. వృద్ధులను పిల్లల వలే ఆదరించాలి.

ప్రేమ ఉంటే తప్పులు కనబడవ్ఞ. వారికి తగు సదుపాయాలు కల్పించండి. అప్పుడువారు ఆనందనంగా ఉంటారు. లేకపోతే మీరు మేరుగా ఉండవచ్చు. వేరుగా ఉండికూడా వారిని ఆదరించవచ్చు. సలహాయకులను తీసుకొని వారికి తగు సౌకర్యాలు అందించవచ్చు.

మీరే స్వయంగా చేయన వసరం లేదు. అన్నింటి కంటే ప్రేమ ముఖ్యం. ప్రేమ ఉన్నప్పుడు ఏ పనైనా తేలికగా చేయగలరు. అప్పుడు వారు కూడా మీలో తప్పులు వెదకరు. గృహ వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. ఆనందంగా జీవితం గడపాలి.

ఇది అవసరం. కోరిక కాదు. అవగాహనతో, సృష్టతతో, జీవితాన్ని ఆనందంగా గడప వచ్చు. వ్యతిరేక ఆలోచనలతో జీవితం దుర్భరంగా ఉంటుంది. అందువల్ల మంచి ఆలోచనలతో ఉండాలి. సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలి.

ప్రేమాభిమానాలతో మన దైనందిన వ్యవహారశైలి ఉండాలి. ద్వేష భావాలను దరికి చేర ఉండాలి. ద్వేష భావాలను దరికి చేరనీయికూడదు.

వ్యక్తిగత అభిరుచులకు గౌరవం ఇవ్వాలి. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రోత్సహించాలి. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. ఇందులో సందేహం లేదు.

డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/