ఇ-ఆటలతో ఉపాధి అవకాశాలు

పబ్జీ, ఫోర్ట్‌నైట్‌, రమ్మీ, డోటా, ఫిపా, స్టార్‌ క్రాఫ్ట్‌కంబాట్స్‌, కౌంటర్‌ స్ట్రయిక్‌-గ్లోబల్‌ ఆఫెన్సిప్‌, అపెక్స్‌ లెజెండ్స్‌.ఆన్‌లైన్‌లో ఆటలు ఆడేవారికి చాలా సుపరిచితమైన పేర్లు, ప్రయాణాల్లో, ఖాళీ సమాయాల్లో మొబైల్‌ పట్టుకుని యుద్ధభూమిలోకి దూకినంత సీరియస్‌గా చాలామంది గేమ్‌లు ఆడేస్తుంటారు. మల్టీఫ్లేయర్‌ విధానమూ వీటిల్లో కనిపిస్తుంది. ఒకరికొకరు సాయపడుతూ, గ్రూపులుగా ఏర్పడుతూ అవతలివారిని ఓడించడం వంటివి చేస్తుంటారు. గెలిచినవారికి పాయింట్లు, రివార్డులు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగా ఆడుకునే సౌకర్యం. అందుకే ఆన్‌లైన్‌ గేమింగ్‌పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది.
పోటీలు నిర్వహించే స్థాయికి చేరింది . ఈ రంగాన్ని ఇప్పుడు ఇ-స్పోర్ట్స్‌/ ప్రొఫెషనల్‌ గేమింగ్‌గా పిలుస్తున్నారు.

ఇ-ఆటలతో ఉపాధి అవకాశాలు
Opportunities with e-games-

ఇ-స్పోర్ట్స్‌ అంటే గేమింగ్‌ అనే భావన ఉంది. కానీ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. గేమింగ్‌ ఆహ్లాదం కోసం ఉపయోగించే సాధారణ ప్రక్రియ. ఇ-స్పోర్ట్స్‌కు కొన్ని నైపుణ్యాలు, శిక్షణ అవసరమవుతాయి. దీన్ని ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌గా పరిగణిస్తున్నారు. ఆడేవారికి జీతభత్యాలు, నగదు బహుమతులూ ఉంటాయి.

ఇ-స్పోర్ట్స్‌ ను వినోదంగానే భావించినప్పటికీ దీనిలో నిపుణులుగా మారడానికి ఆటగాళ్లు ఎంతో శ్రమ, అంకితభావం ప్రదర్శించాల్సి ఉంటుంది. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గంటల వ్యవధిని వెచ్చించాలి. ఏషియన్‌ గేమ్స్‌ వంటి అంతర్జాతీయ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో వీటికి గుర్తింపు వచ్చింది. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లోనూ చోటివ్వాలనే ప్రతిపాదన ఉంది. 2024 ఒలింపిక్స్‌లో వీటిని చూడబోయే అవకాశం ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలో:

ఇ-స్పోర్ట్స్‌ రంగం అవతరించి దశాబ్ద కాలమైంది. గత రెండు, మూడేళ్ల నుంచి మనదేశంలో దీనికి ఆదరణ పెరిగింది. డెవలపర్లతోపాటు ఇన్వెస్టర్లూ ఆసక్తి చూపుతు న్నారు. ఈ పరిశ్రమకు సంబంధించి ప్రపంచంలో అయిదోస్థానంలో భారత్‌ ఉంది.

ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం 2010లో 25 సంస్థలు ఉండేవి. ఇప్పుడు 250కుపైగా గేమ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనగేమ్స్‌ మార్కెట్‌ విలువ 2020కి 1.1 బిలియన డాలర్లకు చేరుతుందని అంచనా. పేటీఎం, అలీబాబా, టెన్సెంట్‌, నజారా వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు పెట్టుబడులు పెడుతు న్నాయి. స్పాన్సర్‌షిప్‌లతో ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి.

మార్కెట్‌ సర్వే ప్రకారం గేమింగ్‌ మార్కెట్‌ ఏటా రెట్టింపు అవుతోంది. మనదేశంలో ఈ-స్పోర్ట్స్‌కు సంబంధించి డిగ్రీలు లేవు. విదేశాల్లో ముఖ్యంగా యూకె, యూఎస్‌ల్లో కొన్ని కళాశాలలు ప్రొఫెషనల్‌ డిగ్రీలను అందిస్తున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్‌ స్టాఫర్డ్‌షైర్‌ (యూకె), బెకర్‌ కాలేజ్‌ ఇన్‌ మసాచ్యుసెట్స్‌ (యూఎస్‌) ఈ-స్పోర్ట్స్‌ కోర్సులను ఆఫర చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఈ-స్పోర్ట్స్‌ అథ్లెట్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఉడెమి అందిస్తోంది. వీటి కాలవ్యవధి గంటల్లో ఉంటుంది. సాధారణంగా 3 నుంచి 5 గంటల వ్యవధితో కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ-స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును కోర్స్‌ఎరా అందిస్తోంది. కాలవ్యవధి రెండునెలలు.

కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీతో ఎంఒయూ చేసుకున్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌, బెంగళూరు
ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నొవేషన్‌, హైదరాబాద్‌, ఫుణె, ఢిల్లీ, ముంబయి
డిఎస్‌కె సుప్‌ ఇన్ఫోకామ్‌
సీమ్‌లెస్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ
భారతీయ విద్యాపీఠ్‌ యూనివర్సిటీ, ఫుణె
మాయా అకాడమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్‌, ముంబయి
ఎరీనా యానిమేషన్స్‌, న్యూఢిల్లీ
జీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌, బెంగళూరు
ఐపిక్సియో యానిమేషన్‌ కాలేజీ, బెంగళూరు
అకాడమీ ఆఫ్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌, నోయిడా వంటి సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/