జంతువుల సంరక్షణలో ఉపాధి అవకాశాలు

Employment Opportunities in Animal Care
Employment Opportunities in Animal Care

పేద, గొప్ప తేడా లేకుండా చాలామంది జంతువులను పెంచుతుంటారు. వాటి చేష్టలకు మురిసిపోతుంటారు. సాటివారితో మాట్లాడినట్లే ఆ జంతువులతోనూ మాట్లాడుతుంటారు. వాటికి ఏమాత్రం తేడా చేసిన ఆందోళన పడిపోయి, ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుంటారు. మనిషికీ, జంతువుకీ మధ్య అనుబంధం అత్యంత ప్రాచీనమైనది అవి చూపించే ప్రేమ, విశ్వాసాలకు మనిషి ఎప్పుడో అలవాటు పడిపోయాడు.

వాటిని జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నాబు. ఇప్పుడు ఆ జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం పెద్ద కెరియర్‌గా మారింది. రకరకాల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అందుకు తగిన కోర్సుల రూపకల్పన జరుగుతోంది. ప్రతి మనిషినీ ఏదో ఒక దశలో ఏకాంతం వెంటాడుతుంది. ఒంటరితనం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు అంటుంటారు. ఆ సమయంలో పెంపుడు జంతువులు తోడుంటే బిపి, కొలెస్టరాల్‌ వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొంతసేపైనా వాటితో గడపనిదే ఉండలేమనేవారు చాలామంది ఉన్నారు.

అలాంటిది రోజంతా వాటితో గడిపే ఉద్యోగం ఉంటే ఎగిరి గంతేయరూ! ఇలాంటి వారిని జంతు ఆధారిత కెరియర్‌ ప్రపంచంలో అవకాశాలు ఆహ్వానిస్తున్నాయి. జంతువులను పరిశీలించడం, వాటి గురించి తెలుసుకోవం, వాటిని బాగుచేయడం ఇలా ఎన్నో విభాగాల్లో దీర్ఘకాలిక రెరియర్‌ అవకాశాలు అందుబాటులో ఉన్నాచి. మనదేశంలోని పలు విద్యాసంస్థలు సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.
వెటర్నరీ డాక్టర్‌: పక్షులు, జంతువులకు సోకే వివిధ రకాల జబ్బులకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌, వాటిని బాగు చేయడానికి సంబంధించిన వెటర్నరీ సైన్స్‌ను ఇందులో చదువుతారు. ఇది కొంచెం మానవ వైద్యశాస్త్రం లాగానే ఉంటుంది.

వీటి ప్రాథమిక లక్ష్యం రోగాలను గుర్తించడం, నయం చేయడం. మొత్తంగా శరీరంలోని అవయవాలు సరిగా పనిచేసేలా చేయడం. అలాగే జంతువులకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడం, ప్రాథమిక చికిత్సను అందించడం వంటివీ చేస్తారు. కుక్కలు, పిల్లలూ, క్రూరజంతువులు మొదలైన వాటిల్లో ఏదో ఒకదానిపై స్పెషలైజేషన్‌ చేసే అవకాశమూ ఉంది. జనరల్‌ వెర్నరీ ఎంచుకుంటే అన్ని రకాల జంతువులకు వైద్యం అందిస్తారు.

అర్హత:

వెటర్నరీ డాక్టర్‌ కావాలనుకునేవారు అయిదేళ్ల బ్యాచిలర్స్‌ ఇన్‌ వెటర్నరీ సైన్స్‌ (బివిఎస్‌సి) పూర్తి చేయాలి. జంతువుల రూపాన్ని కాపాడటంతోపాటు పరిశ్రుభంగా, అందంగా ఉంచడం గోర్లు, జుట్టు సరైన రీతిలో కత్తిరించడం చేస్తారు.

పెంపుడు జంతువుల పట్ల తీసుకువాల్సిన జాగ్రత్తలను యజమానులకు సూచిస్తారు. వీటి ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆదరణ పెరుగుతోంది. పోటీ కూడా ఎక్కువే.
అర్హత: ప్రత్యేకంగా డిగ్రీ అవసరం లేదు. కానీ, సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులను చేసి ఉండాలి. కోర్సుల కాలవ్యవధి సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది. గ్రూమింగ్‌, స్టైలింగ్‌, పెట్స్‌ నిర్వహణ మొదలైన నైపుణ్యాలను నేర్పుతారు. స్పెషలైజ్‌డ్‌ పెట్‌ గ్రూమింగ్‌ కోర్సులు కూడా ఉన్నాచి. విభిన్న జాతుల పెంపుడు జంతువులను గుర్తించడం, వాటి తత్వాలను అర్థం చేసుకోవడం వాటిలో ఉంటాయి.

కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు

పుజ్జీ పుజ్జీ పెట్‌ స్టైలింగ్‌ స్డూడియో అండ్‌ స్పా, బెంగళూరు

స్కూపీ, న్యూఢిల్లీ, రెడ్‌పెట్‌ పాస్‌ పెట్‌ స్పా అండ్‌ షాప్‌, న్యూఢిల్లీ మొదలైనవి.కెరియర్‌: కెనెల్స్‌, వెటర్నరీ క్లినిక్‌లు, యానిమల్‌ షెల్టర్స్‌, పెట్‌ సప్లై స్టోర్లలో వీరికి అవకాశాలుంటాయి. యానిమల్‌ సెలూన్లు, యానిమల్‌ షోలల్లోనూ వీరిని తీసుకుంటారు.

వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌

ఇంట్లో పెంచుకోలేని జంతువుల ఫొటోలను తీయడమే వైల్ట్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ. ఇది సాహసోపేతమైన కెరియర్‌. కేవలం జంతువులు, మొక్కలను ఫొటో తీయడమే కాదు. వాటి జీవన విధానాన్ని సహజసిద్ధంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. చురుకుగా పనిచేసే తత్వం, ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇమడగలిగే వారికి ఇది తగిన కెరియర్‌. కెమెరాలు, యాంగిల్స్‌, ఫొటోగ్రఫీ టర్మినాలజీ, లైటింగ్‌ మొదలైనవి వాటి గురించీ తెలిసుండాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/