శరద్‌ పవార్‌ ఎప్పుడూ అలా వ్యవహరించలేదు

ఎదైనా సమస్య వస్తే ఆయన దగ్గర సలహాలు తీసుకుంటా

uddhav thackeray
uddhav thackeray

ముంబయి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎప్పుడూ రిమోట్ కంట్రోల్‌లా వ్యవహరించలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు. ఏదైనా సమస్య వస్తే తనంత తానే ఆయన దగ్గర సలహాలు తీసుకుంటానని ఆయన అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా ప్రభుత్వంలో పవార్ రిమోట్ కంట్రోల్‌లా నియంత్రిస్తున్నారా అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ… రిమోట్ కంట్రోల్ అనే ప్రశ్నేలేదు. మేము మూడు వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్లం. నేను మా పార్టీకి అధ్యక్షుడిని ఎలాగో పవార్ కూడా అంతే. శరద్ పవార్ ఎప్పుడూ రిమోట్ కంట్రోల్‌లా వ్యవహరించలేదు. ఒకవేళ ఆయనకు సలహాలు ఇవ్వాలనిపిస్తే తప్పకుండా ఇవ్వొచ్చు… అని స్పష్టం చేశారు. శరద్ పవార్ అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి అనీ.. తనకు తప్పకుండా మార్గదర్శకుడిగా ఉంటారని థాకరే పేర్కొన్నారు. ఏదైనా సమస్య వస్తే నేను కూడా ఆయన దగ్గరే సలహాలు తీసుకుంటాను పేర్కొన్నారు.

ెతాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/