దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న రాహుల్
బుర్రకు పదును పెట్టాలని ప్రధానికి సూచన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందంటూకేంద్రంపై ధ్వజమెత్తారు. గుడ్డు లోపల కోడిపిల్ల లోపలే చచ్చిపోయినట్టుగా దేశ ఆర్థిక పరిస్థితి తయారైందన్న రాహుల్, దీనికి ఎవర్ని బాధ్యుల్ని చేయాలో ఆలోచించేందుకు ప్రధాని బుర్రకు పదునుపెట్టాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ‘ఇంకెందుకాలస్యం! ఎవరికీ అంతుచిక్కని నిర్మలా గారు అందించిన పనికిమాలిన బడ్జెట్ ఉంది కదా! దేశ ఆర్థిక పరిస్థితికి ఆ చెత్త బడ్జెట్ ను కారణంగా చూపండి. నిర్మల గారిపై వేటు వేసి, తప్పంతా ఆమె నెత్తిన పడేయండి… సమస్య పరిష్కారమవుతుంది’ అంటూ విమర్శించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/