ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సాధ్యం కాదు

ఎస్ఈసీకి ఏపీ సీఎస్ లేఖ

Neelam Sahni
Neelam Sahni

Amaravati : ప్రస్తుత సరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ నీలం సాహ్నీ స్పష్టం చేశారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ కు  లేఖ రాశారు.

మిగిలిన రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదని పేర్కొన్న ఆమె..కరోనా కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో దాదాపు 7 వేల మంది మరణించారని పేర్కొన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిమరోసారి విజృంభించేందుకు అవకాశం ఉన్న ఎన్నికలకు సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకోలేదని నీలం సాహ్ని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కరోనా గ్రామాలకు పాకిపోతుందని ఆమె పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/