‘ఆచార్య’ టీమ్ లో జాయిన్

సెట్స్ లో అడుగు పెట్టిన సోనూసూద్

Sonu Sood
Sonu Sood

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ”ఆచార్య”.

ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. చిరంజీవి కరోనా నిర్ధారణ పరీక్షలో ముందు పాజిటివ్ అని రావడం.. ఆ తర్వాత నెగటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

అయితే కొరటాల చిత్రీకరణ ఆపేయకుండా చిరు లేని సన్నివేశాలను తీస్తున్నారు. ఈ క్రమంలో కరోనా లాక్ డౌన్ లో రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ ‘ఆచార్య’ సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

కరోనా సమయంలో అనేక సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకున్న సోనూసూద్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరూ సోనూసూద్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో సోనూసూద్ పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/