టి కాంగ్రెస్ ప్రకటనలపై బ్యాన్..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనల ఫై ఎన్నికల సంఘం నిషేదించింది. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా తో పాటు టీవీ చానెల్స్ లలో కాంగ్రెస్ ప్రకటన లు వైరల్ గా మారాయి. మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు ప్రజలను ఆలోచనలో పడేశాయి. గులాబి రంగు కారుతో ప్రచార చిత్రాలను, వీడియోలను తయారు చేయించి ఆ పార్టీని ఓడగొట్టాలనే లక్ష్యంతో కారుకు పంక్చర్లు చేసి తోసేయడం లాంటి దృశ్యాలు దాదాపు అన్ని ప్రకటనల్లోనూ కనిపిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరాలు పెట్టే స్థాయిలో ఈ ప్రకటనలు ఉంటున్నాయని వారు ఫిర్యాదు చేశారు. సీఈవో వికాస్ రాజ్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ యాడ్స్‌ను నిలిపేయాలని అన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానెళ్లకు బహిరంగ లేఖ రాసింది. దీంతో మీడియాలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కాగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటనలపై బ్యాన్ విధించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఒత్తిడితోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.