దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డుపై కోడిగుడ్ల వాహనం బోల్తా

ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం… శుభ్రం చేసిన సిబ్బంది

Road accident in dilsukhnagar
Road accident in dilsukhnagar

హైదరాబాద్‌: నగరంలో కోడిగుడ్లను తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అక్కడున్న జనం వాటిని తీసుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. అయితే కోడిగుడ్లన్నీ రోడ్డుపైనే పగిలిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. ఈ విషయం పూర్తి వివరాల్లోకెళితే… దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలా ఆస్పత్రి ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై కోడిగుడ్లు తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుపైనే కోడిగుడ్లు పగిలిపోయాయి.పగిలిన కోడిగుడ్ల కారణంగా కొన్ని ద్విచక్ర వాహనాలు జారి పడిపోయే అవకాశం ఉంది. రోడ్డుపై కాలు పెట్టినా జారిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో అక్కడి చేరుకున్న సిబ్బంది నీళ్లతో ఆ రోడ్డును శుభ్రం చేసి వెళ్లారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/