కేరళలోమరో ఆరుగురికి సోకిన కరోనా

కర్ణాటకలోనూ నలుగురికి కరోనా వైరస్‌

Kerala reports 6 more cases of coronaviru
Kerala reports 6 more cases of coronaviru

కేరళ: కరోనా వైరస్‌ కేసులు భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కేరళలో మరో ఆరుగురికి కరోనా వైరస్‌ సోకిందని ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో తమ రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 12కు పెరిగిందని చెప్పారు.ఈ నెల 31 వరకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తరగతులు, పరీక్షలను నిర్వహించకూడదని ఆదేశించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని చెప్పారు. అన్ని ట్యూషన్‌ క్లా సులు, అంగన్వాడీలు, మదర్సాలు ఈ నెల 31వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు కర్ణాటకలో నలుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులనూ పరీక్షిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పౌరులంతా సహకరించాలని కోరారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మరింత పెరిగాయి. దాదాపు 50 మందికి పైగా కరోనా పాజిటివ్‌ అని తేలింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/