కరోనా కట్టడిపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదు

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ గత కొన్ని రోజులుగా మోడి ప్రభుత్వాని ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు గాల్వన్‌ లోయలో జరిగిన ఘటనపై వివరాలు కోరుతూ ప్రశ్నలు సంధించిన రాహుల్‌ తాజాగా ఈరోజు వేగంగా వ్యాపిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని మండిపడ్డారు. ‘దేశంలో కొత్త ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది’ అని రాహుల్‌ గాంధీ ట్విట్‌ చేశారు. దీన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. ప్రధాని మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/