బెంగాల్‌లో ఆరు చోట్ల ఈడీ దాడులు

ed-raids

కోల్‌క‌తా: ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో జ‌రిగిన అక్ర‌మాల‌కు చెందిన కేసులో ఈరోజు బెంగాల్‌లో ఈడీ అధికారులు ఆరు చోట్ల త‌నిఖీలు చేస్తున్నారు. టీఎంసీ నేత షేక్ షాహ‌జ‌హాన్ తో లింకున్న ఈ కేసులో ఇప్ప‌టికే ఈడీ ప‌లుమార్లు సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 29వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని గురువార‌మే టీఎంసీ నేత‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. టీఎంసీ నేత షాహ‌జ‌హ‌న్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు. బెంగాల్‌లో జ‌రిగిన పీడీఎస్ స్కామ్‌లో అత‌ను ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నారు. గ‌త వారం సుమారు 120 మంది కేంద్ర బ‌ల‌గాల‌తో షాహ‌జ‌హ‌న్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. ఆయ‌న లేక‌పోవ‌డంతో ఆ ఇంటికి తాళం వేశారు. సందేశ్‌ఖాలీలో మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.