మెగాస్టార్.. మదర్స్ డే విషెస్

చిరంజీవి ట్వీట్

Chiranjeevi-Mothers-Day-Celebrations-With-His-Mother-

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఎంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటారో రియల్ లైఫ్ లో దానికి విరుద్ధంగా సాఫ్ట్ గా ఉంటారు. 

ఆయన పక్కా ఫ్యామిలీ మ్యాన్. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఉంటారు.  మెగాస్టార్ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోలు.. వీడియోలు చూస్తే ఆ విషయం మనకు అర్థం అవుతుంది.

  ఈరోజు మదర్స్ డే సందర్భంగా చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోను చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ “మన అందరి కథల వెనుక ఎప్పుడూ మన అమ్మ కథ ఉంటుంది.

ఎందుకంటే మనం అక్కడే మన పయనం మొదలైంది.  అద్భుత క్షణాలు #హ్యాపీ మదర్స్ డే . @పవన్ కళ్యాణ్ @నాగబాబు #విజయ  #మాధవి”  అంటూ ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో మొదట చిరంజీవి అమ్మగారు అంజనా దేవి గార్డెన్ లో నిలుచుని పూల మొక్కలను పరిశీలిస్తూ ఉంటారు.

ఆ తర్వాత అంజనాదేవి గారితో చిరంజీవి ఫోటో.. నాగబాబు ఫోటో.. పవన్ కళ్యాణ్ ఫోటో.. అందరూ కలిసి ఉన్న ఫోటోలు చూపించారు.

ఇ బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ చిరు దోశ వీడియోను కూడా ఇందులో జోడించడం అందరినీ ఆకట్టుకుంటుంది.

మరో ట్వీట్ లో చిరు “ఎంత క్లిష్టమైన పరిస్థితులలో అయినా అమ్మ ప్రేమకు.. లాక్ డౌన్ లేదు.

ప్రపంచంలోని అందరూ అమ్మలకు సెల్యూట్ చేస్తున్నా #హ్యాపీ మదర్స్ డే” అంటూ అందరి హృదయాలను టచ్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/