ఈడీ అధికారులు కవిత ను అడగబోయే ప్రశ్నలు ఇవేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసులో ఈడీ అధికారులు కవిత ను విచారిస్తున్నారు. ఈ కేసులో హైదరాబాద్​కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, బ్రిండ్‌‌‌‌కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ధాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు 15 వరకు టైమ్ ఇవ్వాలని కవిత కోరగా, ఈడీ నుంచి రిప్లై రాలేదు. దీంతో 11న వస్తానని రిక్వెస్ట్ పంపి, బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించడంతో ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. ఈ విచారణ లో కవిత ను ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు ఇవే అని తెలుస్తుంది.

ఫోన్ల ధ్వంసం, ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్స్, ఆప్ కు హవాలా రూపంలో డబ్బు తరలింపు వంటి అంశాలపై ఈడీ కవితను ప్రశ్నించనుంది. కవితను ముందు విడిగా, ఆ తర్వాత జాయింట్ సెషన్ లో విచారిస్తారని సమాచారం. కవిత అనుచరుడు పిళ్లై ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. అలాగే తీహార్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియాను 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు శుక్రవారం ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో కవిత విచారణలో మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై కూడా ఉంటారని చర్చ జరుగుతోంది. ఈ విచారణ ఒక్క రోజుతోనే ముగిసే పరిస్థితి లేదని, ఆదివారం కూడా కవితను పిలిచే ఆవకాశం ఉందని సమాచారం. మరోపక్క తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీని మోడీ స‌ర్కార్ టార్గెట్ చేసిందని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.