పవన్ వచ్చేసరికి మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేయాలనీ వైసీపీ సర్కార్ ఆదేశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తనపై ఓ పక్క వైసీపీ నేతలు మాటల యుద్ధం చేస్తున్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాను చేయాలనుకున్న పని చేస్తూనే..ప్రశ్నించాల్సిన అంశాల పట్ల ప్రశ్నింస్తున్నాడు. ముఖ్యంగా పవన్ రాష్ట్రంలో దారుణంగా మారిన రోడ్ల దుస్థితి ఫై ఫోకస్ పెట్టారు.

అందులో భాగంగా రేపు గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఉద‌యం 10 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీతో పాటు అనంత‌పురం జిల్లా కొత్త చెరువు వ‌ద్ద ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తు కోసం శ్ర‌మ‌దానం చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఈ టూర్ కు సంబదించిన నేతలు అన్ని సిద్ధం చేసి ఉంచారు. పవన్ రాక నేపథ్యంలో అక్క‌డి అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నారు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న దృష్ట్యా త‌మ‌కు చెడ్డ పేరు రావ‌ద్ద‌న్న ఉద్దేశంతో ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద తాత్కాలిక మ‌ర‌మ్మ‌తులు మొదలుపెట్టారు. ధ‌వ‌శేశ్వ‌రం బ్యారేజీ వ‌ద్ద విద్యుద్దీపాల‌కు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేస్తున్నారు.

కాటన్‌ బ్యారేజీపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చవ‌ద్ద‌ని జ‌ల వ‌న‌రుల శాఖ స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ అక్క‌డ శ్ర‌మ‌దానం చేస్తామని జనసేన చెపుతుంది. మరి రేపు అక్కడ ఏంజరుగుతుందో చూడాలి.