శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ షాక్
సంజయ్ రౌత్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ముంబయి: శివసేన పార్టీ ఎంపీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. గతంలో వెలుగు చూసిన పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రౌత్ పాత్రపై ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణల ఆధారంగా రౌత్‌కు చెందిన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రూ.1,034 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ఈడీ.. తాజాగా రౌత్‌కు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో రౌత్‌కు చెందిన ముంబైలోని అలీబాగ్, దాదర్‌లలోని ఒక్కో ప్లాట్ ఉన్నాయి. ఈడీ అటాచ్‌పై స్పందించిన రౌత్.. ఈ తరహా బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. ఆస్తులను సీజ్ చేసినా, కాల్చివేసినా, జైలుకు పంపినా కూడా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/