22 యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించిన కేంద్రం

18 దేశీయ, 4 పాక్ యూట్యూబ్ చానళ్లపై వేటు

న్యూఢిల్లీ: దేశ భ‌ద్ర‌త‌కు, విదేశీ సంబంధాల‌కు ఆటంకం క‌లిగిస్తున్న 22 యూట్యూబ్ చానెళ్ల‌ను కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. నిషేధానికి గురైన వాటిలో 18 దేశీయ యూట్యూబ్ చానళ్లు కాగా, 4 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లు. దేశభద్రత, ప్రజాక్షేమం దృష్ట్యా నిషేధించినట్టు కేంద్రం వెల్లడించింది. ఆయా యూట్యూబ్ చానళ్లు టీవీ చానళ్ల లోగోలు వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వివరించింది. యూట్యూబ్ చానళ్లనే కాకుండా 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్ బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిషేధించినట్టు తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/