పంచాయితీల నిధుల మళ్లింపుపై హైకోర్టులో కేసు నమోదు

అమరావతి : పంచాయితీల నిధుల మళ్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం పైన ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బిర్రు ప్రతాప్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు 2019 -22 వరకు పంపించిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7660 కోట్లు జమ చేయగా.. సర్పంచులకు తెలియకుండా ఆ నిధులు రూ.7660 కోట్లు రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో సర్పంచుల సంతకాలు లేకుండా పంచాయితీ అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వం జీరో చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై దారి మళ్లించిన నిధుల గూర్చి హైకోర్టులో 2 కేసులు వేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కి వెళ్ళిన రెండు కేసులు త్వరలో విచారణలోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేసు నెంబర్లు డబ్ల్యూ పిఎన్ ఓ: 12172 ఆఫ్ 2022, డబ్ల్యూ పిఎన్ఓ 10405 ఆఫ్ 2022 పేరిట నమోదు చేశారు.

పంచాయతీ రాజ్ ఛాంబర్ తరఫున కేసు వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ పి. వీరా రెడ్డి .నరసింహులు వాదిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం వల్ల తమకు న్యాయం జరుగుతుందని బిర్రు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. లేకపోతే నిధులు, విధులు, అధికారాల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా, రాజకీయాలకతీతంగా ఉద్యమాలను ఉధృతం చేయడానికి సర్పంచులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/