ఏపీలో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ

ఏపీలో ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓ పక్క సభలు , సమావేశాలు జరుపుతూనే సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇదే సందర్బంగా ఒకరిపై ఒకరు పలు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా వ్యక్తులు,మహిళల్ని కించపరచడం, మైనర్లతో ప్రచారం, జంతువులకు హానీ తలపెడుతున్న వీడియోలు, ఫోటోలపై నిషేధం విధించింది.

ఇలాంటి పోస్టులు ఈసీ నోటీసులకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలని అన్ని పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది.నిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసింది. మొదటి నుండి కూడా ఈసీ ఎన్నికల విషయంలో చాల సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఎవరి ఎన్నికల నియమాలు పాటించకపోయిన వారికీ నోటీసులు జారీ చేయడం చేస్తుంది. అలాగే అధికార పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా బదిలీ వేటు వేస్తూ వస్తుంది.