జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో విడత కింద రూ. రూ.698.68 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్ ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నేరుగా తల్లుల బ్యాంకు అకౌంట్‌లో నగదు జమ చేశామని, పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామని తెలిపారు.

కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తుందని జగన్ అన్నారు. మా ప్రభుత్వం … ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే.. ఈ తోడేళ్లంతా పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాయో చెప్పాలంటూ సవాల్ విసిరారు. సినిమాల్లో హీరోలే నచ్చుతారు కానీ విలన్లు కాదంటూ విపక్షాలపై పంచ్‌లు పేల్చారు. ఎవరు ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని విపక్షాలపై విరుచుకుపడ్డారు.