అరుణాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

earthquake

తవాంగ్‌ః ఈరోజు(శనివారం౦ ఉదయం 6.56 గంటలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో స్వల్పంగా తవాంగ్‌లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. తవాంగ్‌కు 64 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది.

శుక్రవారం ఉదయం అర గంట వ్యధిలోనే రాజస్థాన్‌లో మూడుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉదయం 4.09 గంటలకు మొదటిసారి 4.4 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం 4.22 గంటలకు 3.1 తీవ్రత, 4.25 గంటలకు 3.4 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి.