జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో 3.5 తీవ్రతతో భూకంపం

massive earthquake in Japan
earthquake

శ్రీనగర్ః జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. కత్రాకు 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూ కలదలికలు సంభవించాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.

కాగా, బుధవారం తెల్లవారుజామున 12.50 గంటలకు మిజోరంలోని చంఫైలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదయింది. చంఫైకి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఎన్‌సీఎస్‌ తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/