తాగిన మైకంలో ఐఫిల్ టవర్‌పైనే నిద్రపోయిన టూరిస్టులు

ప్రపంచంలో అత్యంత గుర్తింపు టవర్ ”ఐఫిల్ టవర్‌”. ప్యారిస్లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఈ టవర్.. ఫ్రాన్సుకు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా ఎంతో గర్వకారణమైనవి. ఈ టవర్ అగ్రభాగాన కొత్తగా 2022లో డిజిటల్ రేడియో యాంటెన్నాను ఏర్పాటు చేశారు. దీంతో ఆ టవర్ ఎత్తు మరో ఆరు మీటర్లు పెరిగి పూర్తి ఎత్తు 330 మీటర్లకు చేరింది.

ఈ టవర్ ను చూసేందుకు నిత్యం వేలాదిమంది పారిస్ కు వెళ్తుంటారు. తాజాగా ఈ టవర్ ను చూసేందుకు వెళ్లిన టూరిస్టులు మద్యం మత్తులో రాత్రింతా ఆ టవర్ పైనే గడిపారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు..ఫుల్ గా మద్యం సేవించి పైకెక్కారు. తర్వాత కిందకు దిగలేదు.

టవర్ రెండు, మూడు అంతస్తుల మధ్య పర్యాటకులకు అనుమతి లేని ప్రాంతంలో నిద్రపోతున్న అమెరికా టూరిస్టులను సిబ్బంది గుర్తించారు. తాగిన మైకంలో టవర్ ఎక్కిన వారు ఆ రాత్రి అక్కడే చిక్కుకునిపోయి ఉంటారని ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు. భద్రతా సిబ్బందిని బురిడీ కొట్టించి వారు ఐఫిల్ టవర్‌పైకి ఎక్కి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.