హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత..12 మంది అరెస్ట్

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ డ్రగ్స్ విషయంలో చాల సీరియస్ గా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ అనే మాట వినపడడోద్దని..డ్రగ్స్ పట్టివేతలో ఎవరు దొరికిన అస్సలు వదిలిపెట్టొదని సీఎం రేవంత్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అందులో భాగంగానే నగరంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 12 మందిని అరెస్ట్ చేశారు.

పట్టు పడిన నిందితులది నెల్లూరు జిల్లా అని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. నెల్లూరులోను డ్రగ్స్ పిల్స్ విక్రయించినట్టు నిందితులు బయటపెట్టారు. అయితే ఇందులో ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి ఛైర్మన్ కుమారుడు ప్రేమ్‌చంద్‌ బర్త్‌డే వేడుకల కోసం గోవా నుంచి మాదకద్రవ్యాలు తెప్పించడం కలకలం రేపుతోంది.

30 మంది కోసం ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని.. ప్రముఖ సాఫ్ వేర్ కంపెనీలో ఇంజనీర్లు అందరూ కలిపి ఈ పార్టీ చేసుకున్నట్లు సమాచారం.