అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత నౌకాదళం

Drone attack on tankers.. Indian Navy deploys 3 warships in Arabian Sea

న్యూఢిల్లీ: కెమిక‌ల్ ట్యాంక్ ఎంవీ చెమ్ ప్లూటోపై ఆరేబియా స‌ముద్రంలో డ్రోన్ అటాక్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ముంబయి తీరం చేరుకున్న ఆ నౌక‌పై ఫోరెన్సిక్ దర్యాప్తు జ‌రుగుతోంది. దాడి ఎక్క‌డ నుంచి జ‌రిగింది, ఎటువంటి పేలుళ్ల‌ను వాడార‌న్న కోణంలో విచార‌ణ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌తీయ నౌకాద‌ళం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐఎన్ఎస్ మార్మ‌గోవా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌క‌తా యుద్ధ నౌక‌ల‌ ను ఆరేబియా స‌ముద్రంలో నిఘా పెట్టిన‌ట్లు నేవీ వెల్ల‌డించింది.

వాణిజ్య నౌక‌ల‌పై ఆరేబియా స‌ముద్రంలో అటాక్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో పీ-8ఐ లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ విమానాల‌ను కూడా నిఘా కోసం వాడుతున్నారు. ఎర్ర స‌ముద్రం, గ‌ల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఇరాన్ మ‌ద్ద‌తు ఇస్తున్న హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. ఆ ఉగ్ర‌వాదులే వాణిజ్య నౌక‌ల‌ను టార్గెట్ చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

ఎంవీ చెమ్ ప్లూ నౌక సౌదీ అరేబియాలోని ఏ1 జుబెల్ పోర్టు నుంచి న్యూ మంగ‌ళ‌పూరు పోర్టుకు క్రూడ్ ఆయిల్‌ను తీసుకువ‌స్తోంది. అయితే పోరుబంద‌ర్‌కు 217 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఆ నౌక‌పై అటాక్ జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు.