మునుగోడులో టిఆర్ఎస్ దే విజయం: మంత్రి మల్లారెడ్డి

అభివృద్ధి కావాలంటే టిఆర్ఎస్ ను గెలిపించాలన్న సబితా ఇంద్రారెడ్డి

komatireddy-will-loose-in-munugode-says-malla-reddy

హైదరాబాద్ః మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ను గెలిపించి, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మునుగోడు ప్రజలను మోసం చేసిన కోమటిరెడ్డి ఒక 420 అని అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఉప ఎన్నికలో టిఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల కోసం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ ను గెలిపించాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/