జిన్నా నుండి వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రిలీజ్

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జిన్నా. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు..ప్రస్తుతం జిన్నా మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించడం విశేషం. ఈ మూవీ తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమాలోని పాత్రల తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. రీసెంట్ గా సునీల్ తాలూకా లుక్ రిలీజ్ చేయగా..ఈరోజు శనివారం వెన్నెల కిషోర్ పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమా లో వెన్నెల కిషోర్ ‘మైసూర్ బజ్జీ’ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ .. ఆయన ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్రలో కామెడీతో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.