67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీరే

67వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక సోమవారం ఢిల్లీ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధి గా హాజరై , విజేతలకు అవార్డ్స్ అందజేశారు. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కాయి. ‘మణికర్ణిక’ చిత్రానికి గానూ కంగనా రనౌత్‌ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు.

ఉత్తమ నటుడిగా ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)కి అవార్డు దక్కింది. తెలుగులో జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రాగా, మహర్షికి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా రాజుసందరం మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించింది.

67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు 2021 మార్చి 22 న ప్రకటించబడ్డాయి. భారతీయ సినిమారంగంలో 2019లో విడుదలైన ఉత్తమ చిత్రాలను గౌరవించటానికి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వార్షిక జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం 2020, మే 3న జరగాల్సి ఉంది. కాని కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈరోజు ఆ వేడుక పూర్తి అయ్యింది.

67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు ఎవరంటే..

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ పాపులర్‌ చిత్రం- మహర్షి
ఉత్తమ నటి -కంగనా రనౌత్‌ (మణికర్ణిక)
ఉత్తమ నటుడు- మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)
ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే
ఉత్తమ తమిళ చిత్రం- అసురన్‌
ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్
ఉత్తమ దర్శకుడు- సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)
ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)
ఉత్తమ ఎడిటింగ్‌- నవీన్‌ నూలి (జెర్సీ)